••••••••••••••••••••••••••••
ఎవరమ్మాయివి నీవు
ఎవరింటి వెలుగువి నువ్వు
ముగ్ధలతికవా మనోహరిమూర్తివా
చెప్పంగా లేవా తెలుపగజాలవా
వేల్పులవాడ వీడిన
రమణి లలామమణివా
మోహనగీతి పాడేటి
ప్రణయ కవనచంద్రికవా
డస్సిన మనసు ఉబుకే కన్నీటికి
బిగబట్టిన బాధకి దాహాపు పెదాలకి
నువ్వు చిరునామా అయినట్టున్నావు
అవ్యక్త బాధకి అర్ధం కాని సిలబసైనట్టున్నావు..
నవరస భావాల
హాసాల సుమశరమా,
ఏమి నీ బాధ
మనోనేత్రకళల ప్రదీప్తి
కుసుమ దళమంజరి,
ఏమి నీ కధ
సుశోభిత రూపసివి
సౌందర్య జగద్ధాత్రివి
నీ మూగరోదనకు, చరమగీతి నే పాడుతా
నీ సిగపువ్వుల కాటుక, వెల్గులకు కారణమౌతా..
మనోజ్ఞ సుందరి స్నిగ్ధ సుకుమారి
నేను నీ వెంటుంటా తోడునీడనౌతా
కల్యాణ బొట్టునై మేని రక్షకుడినై
నేను ఆ చిరకాలం పెదవినవ్వునౌతా..
నీవు ఎవరమ్మాయివైనా
నా కంటి ఇంటి వెలుగువి
యిక నువ్వే నువ్వే..నా నువ్వే నువ్వే
••••••••
విసురజ
03/08/2024
No comments:
Post a Comment