Friday, 30 August 2024

కవిత:తరువా, ఓ చిన్న మాట

 ఇరు పాషాణబండల అవధులు దాటి 

వెనక్కులాగే వాళ్ళని వేళ్ళతో ధిక్కరిస్తూ నీలాకాశపు శోభను పచ్చగా చేయాలని       నింగికి చేరాలని ఎగబాకింది ఓ తరువు 


మిణుకుమనే తారలెన్ని నింగినున్నా 

వెన్నెలిచ్చే జాబిల్లి సొబగు వేరులే   

కానలలో తిరుగాడు వ్యాఘ్రాలెన్నున్నా 

చారల పులి పరుగు లెక్కేవేరులే 


ఉన్నచోటే ఎగబాకి పెరిగి పెద్దయితే 

మరిక తరువు ప్రత్యేకత ఏముంది 

ఎంత రమ్యమైన సుందర స్వప్నమైనా  

వాస్తవికతకు గంతలు కడితే అర్థమేముంది   


జనజీవన స్రవంతికి తరువా

నీవే హితమూర్తివి 

అయినా అధముడై నరుడు 

నీకు హానిచేయ 

ఆక్సిజెన్ పొందేది నీనుంచయినా  

నిన్నే నరుకుతాం 

నిన్ను నరికి చీల్చి 

గృహబద్దగా చేసుకుంటాం 


మేము జ్ఞానమున్న అజ్ఞానులం 

నీగొప్పని ఒప్పలేని ఉద్దండులం  

నరులం అధములం కుబుద్ధులం 

రేపటి విజనులేని సగటుమనుషులం 

••••••••••••

విసురజ/జగన్నాధ్

G

(నేటి పర్యావరణ దినోత్సవ సందర్భముగా)

No comments:

Post a Comment