••••••••••••••••
వలపు అర్చన వేళలలో
నా చెలివి నీవే
నా చెలిమి కలిమి
సర్వము నీవే...నీవేలే
మనసు అర్పణ వేళలలో
నీ కులుకుల వగలన్నీ
నీ తళుకుల ప్రభలన్నీ
గుత్తంగా నావే...నావేలే
వెంటాడే సోగకళ్ల సింగారాలకు
చెరగని చెదరని చిరునామా నీదేగా
వేటాడే సిగ్గులొలుకు ఎర్రబుగ్గల
మధుర మందస్మిత చినదానివి నీవేగా
ఓ చెలి దివ్య మనోహరి
నీ స్నేహ పరిమళాలతో
నా ప్రేమని సుగంధింప చేసావు
ఓ నెచ్చెలి ప్రియ విరజాజి
నీ కమ్మని పలకరింపుతో
నా కవితకి ప్రాణం పోసావు
నీ ప్రణయ తరువుల నీడలలో
ఆనందాన ఉల్లము ఊయలూగే
నా తీయని నవ్వుల ముట్టడిలో
పురివిప్పిన ప్రాయం మయూరమాయే
ఓ చెలి నా ప్రియనెచ్చెలి
జర ప్రేమతో చేరరావా
ఎద మాట వినిపోవా
ఒడిలో ఒదిగిపోవా
మది తీపి తినిపోవా
••••••••••••
విసురజ
No comments:
Post a Comment