Thursday, 8 July 2021

కవిత:పొద్దు పొడిచే

 కవిత:పొద్దు పొడిచే

••••••••••••••••••• పొద్దుకాలే వచ్చీసిండు మా పల్లెకు ప్రచండ భానుడు విలసిల్లే తూరుపునుంచి వేడిమి కిరణాలను ప్రసరించంగా పుడమి జనులు తల్లడిల్లే.. పొద్దు పొడిచే కొత్త పొద్దొచ్చే పక్షీ లేచే పల్లె లేచే రైతు లేచే లేచే ఆవు/ఎద్దు కుక్క మేక కానీ మత్తునిద్దురలోనున్న బద్దక మొద్దు లేవమరచే.. కర్షక కార్మీక శ్రామిక వర్గాలకు రెక్కాడనిదే డొక్కాడదుగా కలాలను విదిలించు రచయతల్లారా కవన పొద్దుపొద్దుచే లేవండహో ఆత్మీయ అనురాగ భాషిత భూషితాలతో సుమశరాల్లాంటి కైతలను సంధించండి ప్రణయ విరస సరస ఫక్కుమనేట్టి కైతల కవితమ్మ సోకుల దర్శనం అందించండి •••••••••••• విసురజ/వి.జగన్నాధ్ 08/07/2021

No comments:

Post a Comment