Friday, 30 August 2024

శీర్షిక:మినీ కథ-కైత

 ఏదో ఆలోచిస్తూ 

అల్లినజడనే అల్లుతూ 

బెదురుతు ఎదురుగా  

నవ్వని నవయవ్వని 


ఎడ్రెస్సేదో అడగగా  

నే తనదడిగా 

ఎర్రబడిన మోములో 

కోపంతో ముక్కుపుటాలెగరేస్తూ  


తిడదామని తయారైతే

అందంగా వున్నావని 

తన ముస్తాబుని మెచ్చగానే 

తబ్బిబ్బై చివాట్లు వదిలేసే  


సందు దొరికందని 

హృది తనదనగానే  

మొదటి కలయకలోనే 

చెబుతారా అట్లాననే 


పడకు వెనుకని 

మరొకర్ని చూసుకోమని 

అల్టిమేటమిచ్చి

తరలా అపరంజి 


ఇడ్లి కాకపోతే దోశ 

కోరుకోవడానికి కొనడానికి 

కాదిది హోటలు మేటర్   

మరొకర్ని కోరలేని జీవితమిదన్నా 


నువ్వు కలవలేదనే కాబోలు 

ఇంకనూ నే బ్రహ్మచారినన్నా  

ఇంతకాలం ఎవర్ని నచ్చుకోలేదని 

ఎవరితో ఏమి పంచుకోలేదన్నా  


మొదలు తుది 

ఏదైనా నీతోనేనన్నా 

బ్రతుకున వినోదమా/వెతలా 

నువ్వే తేల్చాలన్నా  


ఆకర్షణ కోరికైతే 

నాదస్సలు కాదని 

లవ్ యట్ ఫస్ట్ సైటని 

తెగేసి చెప్పినా 


అంతే ఆగి

తేరిపార చూసి

పద్ధతైన పిల్లకై 

పెద్దవాళ్ళని అడగాలనే   


తన గ్రీన్సిగ్నలన్దగానే 

వెనకనే తనిల్లుచేరా   

వాళ్ళవాళ్ళని కలిసా 

మనసుమాట తెలిపా 


నింగి తారకై  

మచ్చలేని నెలరాజుని  

జంటకై వచ్చానన్నా 

భజంత్రీలు ఎప్పుడన్నా 


ముందుగా నసిగినా 

ఎంక్వయిరీ రిపోర్ట్ 

ఫేవరుగా రాబట్టి  

అపరంజి నాదయ్యింది 


ఇంకేముంది 

కథ కంచికి 

మేము ఊటీకి 

కవిత వాట్సాప్లోకి 

••••••

విసురజ

18/08/2024

No comments:

Post a Comment