Friday, 30 August 2024

కవిత:తెలుసుకో, తెలుసుకో

 ప్రణయమా తెలుసుకో 

కోడె వయసే ఆత్రానికి 

తాత్సారం ఒప్పదు నప్పదని తెలుసుకో 


1.

మది గదిలోనూ 

హృదిలోనూ, నీవే నీవే 

ఈ ఎద నిండా 

వెలిగేది మెరిసేది, నీవే నీవే 


2.

అనురాగ వీణియ

రాగం తానం నీవే, నీవే 

నా ప్రణయ గీతిక

భావం భాష్యం నీవే, నీవే 


3.

తలపులోని తీపికి  

రంగు రూపు నీవే, నీవే 

గుండెలో వలపునకు 

దీపం జీవం నీవే, నీవే 


4.

వెన్నెల సొగసుకు 

కులుకు జిలుగు నీవే, నీవే 

చైత్రపు తొలకరికి 

ఆకు విత్తు నీవే, నీవే 



ప్రణయమా తెలుసుకో 

కోడె వయసే ఆత్రానికి 

తాత్సారం ఒప్పదు నప్పదని, తెలుసుకో 

ఈ ఎద నిండా 

వెలిగేది మెరిసేది నీవేనని, తెలుసుకో  

••••••••

విసురజ/జగన్నాథ్

25/05/2024

No comments:

Post a Comment