••••••••••••••••••
విముఖత నీ స్వరమైతే
రాగలయలు విరాగగీతి పాడులే
విలాసం నీ నివాసమైతే
కష్టకాలానికి స్వాగతగీతి తెలుపులే.
కళ్ళు తెరిచి నిద్దుర పోమాకు
ఒళ్ళు మరిచి ఎగర బామాకు
స్థాయి విడిచి ఎదగ చూడకు
మాట మడిచి జేబులో పెట్టకు
ఓ..కుదురులేని కుర్రవాడా
ఓ..ఆతురతల వెర్రివాడా
బ్రతుకు పోరులో
గెలుపుకై పరుగులో...
శ్రమతో బేరం
తగదు, తగదోయి
మార్పుతో స్నేహం
సబబు, సబబోయ్
అలసత్వం అల్పత్వం
ఎన్నడూ కూడదోయ్..
గాభరా దుబారా
ఎన్నడూ కలిసిరావోయ్..
నీ ఎదుగుదలకై
ఆరాటం తప్పు కాదోయ్.
మేటి బ్రతుకుకై
యుద్ధం చేయక తప్పదోయ్..
బ్రతుకు పుస్తకంలో
ప్రతి పేజీ కొత్త పాఠమే
ఒద్దిక జీవితంలో
ప్రతి రోజూ రస రమ్యమే..
••••••••••
విసురజ
No comments:
Post a Comment