Friday, 30 August 2024

కవిత:ప్రేమ పలవరింపు

 సరసాల సరాగరాగ మంజరి మయూరి 

చెలి మనోహరి ఆత్మీయ వయ్యారి

కన్నెత్తి చూడవా వలచావని చెప్పవా  

దరి చేరరావా మనసు మురియ


నిండు జాబిలీ 

ఈర్ష్యపడే 

అందం నీదిలే 


లావణ్యానికే లావణ్యపు 

సోకులద్దే 

సొబగు నీదేలే


నీలాల నింగిలో

మెరిసేటి 

విద్యుల్లతవి నీవులే 


ప్రాయాల పుంతలో

మెరుస్తున్న 

తనుల్లతవి నీవేలే


చలించే మనసుకు

రసస్పందనలు 

నేర్పింది నీవులే 


నడిచేటి వయసుకు 

నవరాజభోగాలు

పంచింది నీవేలే


సుందరీ సుహాసిని

సొగసుల శ్రీలతా 

మనసే మురియగా

వయసే విరియగా 

ప్రేమతో చెంతచేర

(ప్రియమార) పాలింపవా లాలింపవా...

•••••••

జగన్/విసురజ

No comments:

Post a Comment