సరిగమ రాగాల్లో
నీ పిలుపే వినవచ్చే
సెలయేటి అలల్లో
నీ రూపే కానవచ్చే
కులుకులమ్మ నీ పేరా
సింగారం నీ ఇంటి పేరా l
ఓ చెలి ఓహో చెలి
మనోహర నెచ్చెలి
1)
నీరూపం మణిదీపం
వలపు వెలుగులు పంచే కాంతిపుంజం
విరిసిన పువ్వులలో నువ్వున్నావు
నా పలవరింతలకు కారణమైనావు
2)
అందానికి అద్దమయ్యేవు
అర్ధం చేసుకునే మనసుకి వశమయ్యావు
వగలవీణియలను ప్రణయాన సవరించి
ఎదసల్లాపాలే మనసున తలచితడిమావు
No comments:
Post a Comment