ఒకరికొకరమని ఒకరికై మరొకరమని
హర్షానందాల సంగమ శృతికృతిలో
సాగేటి ప్రమోదాల అనురాగవల్లరులకు రసాత్మక ఆటపాటలకు కన్నేదోకుట్టింది
పరిశ్రమతో పల్లవించిన సంతోషాలు
బ్రతుకుని రమణీయం చేసేవేళ
ఊహించని దెబ్బతో అనుకోని కుదుపు
వేధించే వెతలకు రారమ్మని పిలుపు
వాడుతున్న మందు నడుస్తున్న వైద్యం జర మానేయమని అసలు వేసుకోవద్దని
ఒక వైద్యుని తప్పుడు సలహా
కొంప ముంచింది కన్నీటిని మిగిల్చింది
పాటల పల్లకీలో
ఊరేగు కవితని
చూసి, పీడ పళ్ళికిలించింది
అయ్యో, తీరని కష్టమొచ్చింది
భావసారూప్య తాళాలలో
సరిగమల తీపిరాగాలలో
సంసారపు పదనిసల
గానలాహిరి గాడితప్పింది
కష్టాల కాలరుని పట్టుకుని గుంచి
ధైర్యపు పొగరుతో ఎదిరించి పోరాడావు
నిర్భీతిగా నీ వాళ్ళకై నిలబడి
నడతతో సహనంతో అన్నిటిని ఎదురొడ్డావు
కాదు తేలికైనది పలకరించిన కష్టం
లేదు తల్లడిల్లిన మనసుకి ఊరటన్నది
లేదు లొంగనదేది సేవాభక్తికి ప్రేమజ్యోతికి
కాచి కాపాడేది ఎదునందలోలుడు పైవాడే
తప్పక మళ్ళీ చిగురించే తరువు
సూటగు (తగు) కాలం ముచ్చటగా పలకరిస్తే
భలేగా నీవు నవ్వేవులే త్వరలోనే
కాష్టమై కష్టం అంతలోనే జ్వలించేనులే
కన్నుల్లో మెరుపు బుగ్గల్లో ఎరుపు
ఆటపాటల కేరింతల కోలాటాలు
స్నిగ్దనవ్వులు తప్పక చూస్తాములే కలకాలం
వేచుంటాం వద్దన్నా కవనమై అచిరకాలం
•••••••••
విసురజ
No comments:
Post a Comment