Friday, 30 August 2024

 పొటిక్కలంటే ప్రేమ 

పూతరేకంటే మక్కువ 

అబ్బో గోదారొళ్లకు

తిండియావెక్కువని పేరులే 


పక్కింట్లో ఫంక్షన్నంటే 

మనింట్లోనంత హడావిడి 

అబ్బో గోదారొళ్లంటే 

అభిమానానికి అడ్రస్సేగా 


ఆయ్ లు అండిలు 

సావాస సహపంక్తి భోజనాలెక్కువా 

మమకారంలోనూ వెటకారముండు 

అట్లే వెటకారంలోనూ ఆత్మీయతపండు

No comments:

Post a Comment