లేదు లేదు....లేదులే
ఇది జరిగే పని..కాదులే
మనసు గుర్రాన్ని పట్టి..ఆపడం, ఓపడం..
సులువైన పనేమి కాదు..కాదులే,
కాదుకాదులే..
ఇది కాదనలేని..సత్యములే,
తర్కమేమి లేని..నిజములే..
1)
తోటలోని పూలన్నీ
స్వామి సన్నిధికి..చేరునా
ఎద మీటే గీతాలన్నీ
చెలి స్వరాన..పలికేనా..
తన కొంగు నా అంగీతో ముడిపడేనా..
2)
పెంచుకున్న ఆశలన్నీ
ఎడద రాణికి..చెప్పవునా
చెలిమిలోని తీపితావిని
ప్రణయ రసఝరులుగా..మార్చగునా
ఆనంద భావజలనిధి..సొంతమగునా.
3)
నీ సొగసులోని.మెరుపులన్నీ
కవి కాకనే వర్ణించగా..వీలగునా..
నీ పదముల..మధురాలను
మది వీణియపై వల్లించ..వీలగునా
పెదవుల పూచే కమలాలే..నాకందునా..
లేదు లేదు....లేదులే
ఇది జరిగే పని..కాదులే
మనసు గుర్రాన్ని పట్టి..ఆపడం, ఓపడం..
సులువైన పనేమి కాదు..కాదులే, కాదుకాదులే..
ఇది కాదనలేని..సత్యములే,
తర్కమేమి లేని..నిజములే..
••••••••••••
విసురజ
No comments:
Post a Comment