ఉదయమే పలకరించ
హృదయమే పులకరిస్తే
నీలో కలవరింతల పలవరింతకి మనసున్నట్టే
కోయిల పాటపాడగా
ఉల్లమే ఉల్లాసపడితే
నీలో ఆనందాల రసరమ్యతలింకా బతికున్నట్టే
కొత్త కాపు విరబూసినా
పూతంతా పూవులై చేతికందదులే
కృత్రిమనవ్వు మోములో తారాడినా
ఎదలోని బాధ దూరమవ్వదులే
వెలుగుకై చీకటి
నలుపు తెలుపుల్లో ఎదురు చూసే
రేపటికై మనిషి
వివిధ వర్ణాలలో కలలు కనే
ఎదురుదెబ్బలు వింత కాదు
బ్రతుకు పోరుబాటలో
రాళ్లదెబ్బలు తప్ప జాలవు
పండ్లచెట్టు బతుకున
యోచించి ప్రతినలు పూనాలి
సాధ్యాసాధ్యాల బేరీజు గణిస్తూ
గుణించి కర్మలు సలపాలి
తప్పుతడకల పద్ధతుల్ని సమీక్షిస్తూ..
తెలిసుండీ లేనిదానికై ఆశపడితే
రామాయణం రచించబడి దిక్సూచిగా నిలిచే
యోచించక గబుక్కున ఫక్కుమంటే
మహాభారతమే జరిగి వినాశనమే కలిగే
••••••••••
విసురజ
07/07/2024
No comments:
Post a Comment