రూపంలో ప్రతిరూపం ఇమిడితే
చిత్రము విచిత్రమేగా
బ్రతుకులో సంతృప్తిగా వుంటే
జీవితము అనందమయమేగా
కీర్తనతో సంకీర్తనలే జతకడితే
జగము డోలలూగేనుగా
బోధనలో ఉద్బోధలనే జేర్చితే
జీవనము సుఖమయమేగా
చనువులో అతిచనువుని ప్రదర్శిస్తే నెయ్యము నరకమయ్యేగా
మాన్యుల సామాన్యుల తేడాసమసిపోతే
లోకము ఆనందసాగరమయ్యేగా
వచనాలలో ప్రవచనాలు వల్లించనచో
వ్యవహారానికి పట్టంకట్టబడేగా
దృష్టిలో దూరదృష్టీ సమ్మిళమైతే
విజయము ఇంటిపేరయ్యేగా
జయాలు అపజయాలు పలకరిస్తే విధిబలీయతే అవగతమయ్యేగా
కధలో పిట్టకధలు కూతపెడితే
కావ్యము కమనీయమయ్యేగా
కళ్ళళ్ళో నకళ్ళను నిలుపుకోకుంటే భవితవ్యము బంగారమయ్యేగా
అశలో నిరాశ చేరకుంటే
భవిష్యత్తు రంగులమయమేగా
••••••••••••••
విసురజ
No comments:
Post a Comment