Friday, 30 August 2024

శీర్షిక:పాట ప్రాముఖ్యత

 ఏమని చెప్పాలి ఇంకెలా తెలపాలి 

పల్లవీ చరణాలు లేని పాటకి  

వేడుకలు ఆనందాలే సాహిత్యమని  


అలసి సోలిన బతుకులో   

చెమటని తుడిచే చెయ్యే పాట 

వేదనలు పలకరించు వేళలో

బాధలని మరిపించేదే పాట 


పంచిన పదాలతో 

పాటలని నచ్చి మెచ్చిన విధంగా 

"తీరిక చేసుకుని" 

సొగసుగా పాడడమే కదా కడు వింత  


వాణి బాణిల సరిజోతతో 

ఇంపు సొంపైన గానాలతో 

"పాటలూయల" నర్మదా ప్రవాహమే 

ఓలలాడించు రసఝరుల సామ్రాజ్యమే  


గాన వసంతాల యామినిలో 

సల్లాపాల ఆహ్లాదఝరి ఆనందాలే 

వీనుల విందుగా పాటల రథం సాగాలి

మీ మాట నా పాట అందరు పాడాలిలే   


రసరాగ వేళలలో 

ప్రియభారతి తీపి గొంతులు పాడాలి  

గానమాధుర్య హేలచే 

గీర్వాణి కంట మురిపెము విరియాలి   


ఏమని చెప్పాలి ఇంకెలా తెలపాలి 

పల్లవి చరణాలు లేని పాటకి  

వేడుకలు ఆనందాలే సాహిత్యమని   


అందుకే ఆపరాదు గానం 

అది జీవనదిలా పారాలి 

పాటల తోటలో 

జీవులు ఆహ్లాదం చెందాలి     

••••••••••

విసురజ

No comments:

Post a Comment