అరచేయి చాచింది
చందమామంటి భామ
కంటి కరుణరసాలతో
చిక్కని ఆధరాలలాలితో
నింగివేల్పుల పిల్లలు
ముచ్చటపడి చుక్కలతో
మేనిరంగుతో పోటీపడేటి
రంగవల్లులే దిద్ధంగా
రేరాణంటి మల్లిక
మనసూ తనువూ
సుగంధ యశోశోభితమై
పరిమిళించే జన్మంతా
•••••••••
విసురజ/జగన్నాధ్
18/05/2024
No comments:
Post a Comment