కన్నుల పరదాలు తొలిగెలే
ఎదలో ప్రణయదీపం వెలిగేనులే
పూల వాకిట్లో
వలపు సావిట్లో
నింగిని చూస్తూ మనం
ఈ ఆనందం అవ్యక్తం
ఆ హాయికి మనసు
రివ్వున రివ్వున ఎగిరేనులే
చెరి సగమై మనమే
జగాన ఆనందాల ఊయల ఊగేములే
మెచ్చిన నెచ్చెలి
గిల్లే శీతగాలి
వలచిన కాంతతో
దొరికే ఏకాంతం
ఆ హాయికి మనసు
రివ్వున రివ్వున ఎగిరేనులే
చెరి సగమై మనమే
జగాన ఆనందాల ఊయల ఊగేములే
ప్రక్రుతి ఇష్టమై పూలచొక్కా తొడిగినట్టు
దిక్కులు మనకై కన్నులు మూసుకున్నట్టు
మన కాకెంగిళ్ళ సరదా వల్లరులతో
కౌగిళ్ల పలవరింతలు కలవరింతలైనట్టు
ఆ హాయికి మనసు
రివ్వున రివ్వున ఎగిరేనులే
చెరి సగమై మనమే
జగాన ఆనందాల ఊయల ఊగేములే
నెయ్యాన మనకై మన యువజతకై
ఋతురాగాలు స్వరజతులని పాడే
ప్రణయభావాలు తీపివ్యధని తెలిపే
తలపులతాళాలు మదితలపు తెరిచే
ఆ హాయికి మనసు
రివ్వున రివ్వున ఎగిరేనులే
చెరి సగమై మనమే
జగాన ఆనందాల ఊయల ఊగేములే
కన్నుల పరదాలు తొలిగెలే
ఎదలో ప్రణయదీపం వెలిగేనులే
•••••••••••••
విసురజ
28/06/2024
No comments:
Post a Comment