Friday, 30 August 2024

పాట/కవిత:ఒక్క సారి..మరొక్క సారి

 •••••••••••••••••

ఒక్క సారి..మరొక్క సారి 

నీ చెంత నేను చేరు చిన్న ఆశ 

తీరి మనసు మురిసే వేళ 

ఒక్క సారి..మరొక్క సారి 

ఒక్క సారి..మరొక్క సారి 

నిను తలచి నేను మురవనా 


1)

నిను చేరి నీతో చిన్నగా మాటాడగా 

అలా మెల్లగా జారుకోక 

మనసే తెలుసుకోవా  

మమతే పంచుకోగా 

మళ్ళీ మళ్ళీ అదే మాట అదే పాట 

ఒక్క సారి..మరొక్క సారి అంటూ 


2)

పాటల లోని రాగ లయలు 

రవము లోని సరి గమలు 

చెలియ తోడులోనే అందగా 

బ్రతుకులో కలలన్నీ నిండుగా పండగా 

తనే బ్రతుకై నా బ్రతుకుని తీర్చదిద్దగా 


ఒక్క సారి..మరొక్క సారి 

నీ చెంత నేను చేరు చిన్న ఆశ 

తీరి మనసు మురిసే వేళ 

ఒక్క సారి..మరొక్క సారి 

ఒక్క సారి..మరొక్క సారి 

నిను తలచి నేను మురవనా 

•••••••••

విసురజ

(మల్లెపూవు సినిమాలోని "చిన్న మాట ఒక చిన్న మాట inspiration/ప్రేరణతో వ్రాసిన పాట/కవిత.సాధ్యమైనంత వరకు అలతి అలతి పదాలనే పొదిగా, ఆపై పాఠకుల మెప్పు/దీవెనలు అందితే అన్నయ్య భువనచంద్ర గారి ఏకలవ్య శిష్యుడిగా, మహాకవి వేటూరి గారి భక్తుడిగా, సిరివెన్నెల గారి శైలికి ఆరాధికుడిగా, అవన్నీ వాళ్ళకే చెందు, ఇక ఏమైనా తప్పులుంటే అవన్నీ ఈ భవదీయుడు జగన్నాధ్ ఉరఫ్ విసురజ గా తెలియబడే నావే)

No comments:

Post a Comment