Friday, 30 August 2024

కవిత:నాన్న ప్రేమ అజరామరం

 నాన్న../అప్ప 

నీ ప్రేమ అవ్యక్తం  

తండ్రి నీదు మమత 

అమరం అజరామరం 


నన్నీ లోకంలోకి తెచ్చి మురిసావు  

ఓపికతో నా అల్లరిని భరించేవు 

నడక నేర్పి లోకం చూపించావు 

మంచి నడత ఆవశ్యకత తెలిపావు  

నాన్న, మా మంచి నాన్న మహనీయుడుగా  


ఎదుగు వేళలలో ఒదగడం చూపావు 

చదువు కాలంలో అడగడం నేర్పావు

విద్యతో పాటు క్రమశిక్షణ విలువన్నావు 

ఏ ఎండకా ఆ గొడుగు పట్టద్దన్నావు 

నాన్న, మా మంచి నాన్న మహనీయుడుగా  


ఇంకా చెప్పాలంటే..

స్వీయ పరివారానికై 

విద్యుత్తులా వెలిగేవు 

విద్వత్తును పంచేవు 

వత్తిలా కాలిపోయేవు 

విత్తుకై పరిశ్రమించేవు 

నాన్న, మా మంచి నాన్న మహనీయుడుగా  


ఇష్టమైన వాళ్లకై 

కొలువుల్ని నిర్వహించేవు 

కష్టాల్ని భరించేవు   

విపత్తుల్ని ఎదుర్కొన్నావు 

విరోధుల్ని నిలువరించేవు 

నాన్న, మా మంచి నాన్న మహనీయుడుగా  


నాకిది కావాలని అడగవు 

ఏదైనా తెస్తే నాకెందుకంటావు 

ఎదురుగా వుంటే చాలంటావు 

కుటుంబంతో కబుర్లే కలిమంటావు 

నాన్న, మా మంచి నాన్న మహనీయుడుగా  


నాన్న../అప్ప 

నీ నుంచి ఎంతో నేర్చాము 

నీ ప్రేమ అవ్యక్తని తెలిశాము 

నీదు మనసులో కల్తీ శున్యం  

నీదు మమత అమరం, అజరామరం 

•••••••••••

విసురజ/జగన్నాధ్

16/06/2024

No comments:

Post a Comment