••••••••••••••••••••••••••
వేద శుభభారతికి వందనం
విశ్వ సుమధాత్రికి అభివందనం
భరత భూమికి వందనం అభివందనం
పావన జననికి వందనం అభివందనం
పుణ్య గంగా ప్రవాహ ప్రణవ ధరిత్రికి వందనం అభివందనం
సీతా రాములు తిరుగాడిన పుడమి తల్లికి వందనం అభివందనం
చేవ కలిగిన జనుల చైతన్య స్రవంతికి
వందనం అభివందనం
ఆస్రిత జనులకు అభయ జయవసుధకి
వందనం అభివందనం
జాతి గౌరవాన్ని చాటే మువ్వన్నెల జెండాకి
వందనం అభివందనం
రెప రెపలాడే నా దేశ కేతన భవ్యపొగరుకి
వందనం అభివందనం
సమస్యల్ని దునిమి అసమానతల్ని నులిమి
పదండి పైపైకి ప్రగతి పథంలో
కల్మషాలని విడిచి అనుమానాలని తరిమి
పయనిద్దాం కలిసి విజయ రథంలో
పెద్దవారిని గౌరవించే పెద్దమనసు చూపుదాం చేయూత అందుదాం పుష్టిగా
చిన్నాపెద్దా అందరిని కలుపుకుని
సాగుదాం సమిష్టిగా గెలుద్దాం సంతుష్టిగా
ఆవేశ కావేశాలు వీడి
సర్వ జనహితమే కోరితే
దేశ సౌహార్ద్రత
పరిరక్షణా బీజము పడేదప్పుడే
సొంత అజెండా లేని దిశగా
మనం నడిచిననాడే
విశిష్ట జెండా పండుగ
నిజమయ్యే క్షణాలు అప్పుడే
•••••••••••
No comments:
Post a Comment