మనసుని మాయ చేసిన
ఓ చెలి నిన్నెలా వర్ణించను..
పదాల పూలని వర్షిపిస్తూ
ఓ చెలి మది గుట్టునెల నీకెలా తెలిపను..
అదిగో అదిగదిగో
ఆ..
..ఋతువుల గానం
..ఆమని హరితం
.కస్తూరి పరిమళం
అవన్నిటికి కారణం నీ నవ్వేనా
ఓ చెలి అంత అందం నీదేనా ..
చూస్తే, చూడబోతే..
..రేరాణి వెలుగుజిలుగులు
..నింగితారల మిలమిలలు
..విద్యుల్లతల కాంతిపుంజాలు
నీవు అరువిచ్చిన సొబగులనిపించే
ఓ చెలి అవి నీ వదన మెరుపనిపించే..
కళ్ళతో నవ్వుతూ
మాటలతో మంత్రం వేస్తావు..
తీయగా పలకరిస్తూ
చిలిపి భావాలే రేపుతావు..
నీ మేని ప్రభ కిరణాల దాష్టీకాలను
ఓ చెలి వాటిని ఓపలేను, తాళలేను..
పెదవిని పంటనొక్కి
గుండెకు గాయం చేస్తావు..
మందస్మిత చేవ్రాలుతో
వలపుకి రాదారి వేస్తావు..
కలలలో నిన్నే వరించి హాయినొందా
ఓ చెలి అనురాగ ప్రణయహేలలో విహరించా..
రాజహంస నడకలు
కోయిల పలుకులు
ఊర్వశి సొగసులు
రతియ కులుకులు..
అపూర్వమైన ఆకర్షణలెన్నెన్నో నీలో తొణికే
ఓ చెలి నా హృదిని వలదన్నా కెలికి మురిసే..
అందుకే,
మనసుని మాయ చేసిన
ఓ చెలి నిన్నిలా వర్ణించాను..
నా హృది భాష్యాన్ని స్వీకరించి
ఓ చెలి మనస్విని నీ చేయిని అందించుమా..
•••••••••
విసురజ/జగన్నాధ్
25/06/2024
No comments:
Post a Comment