Tuesday, 2 August 2011

అభ్యుదయ మంత్రం

వచ్చినాను వేన వేల కోరికలతో ఈ పృధ్విపైకి
తీర చూడ మనష్యుల తీరు చూడ మనస్సు బెంబేలు చెంద
తీరు మార్చ నాకు వచ్చిన చదువు నేర్చిన పద్దతులు నేర్పబోవ
తేగ మెక్కే మూఢులకు ప్రయోజనం కోరు జనులు హితులౌన
నా ప్రజలని నా సాటి జీవన సహ యాత్రికులని చెప్పి చూసా చెడ్డైన
ఇక లాభము లేదని ఎగసి అరచి ఎగసి వగచి అలిసి సొలిసి మిగిలినాను డస్సినై
కోరికలనే బుట్ట నెత్తినెట్టి కర్తవ్యమనే దీక్ష చేబట్టి
ముందుకు వురికినాను సమాజపు నీలిపోకడలను యెండగట్టి
ఉరికినాను ప్రతిన బూని నవ సమాజ నిర్మాణం కోరకై
అదుగదిగో నవభారత నవనిర్మిత నవ నవ్య సమాజం
రంగు రూపు జాతి కులం ప్రాతిపదిక కాదుగా
చూడరు యిక్కడ మనుష్యులును వేరువేరుగ
నిష్కల్మష్మైన మనస్సు సేవతత్పరత అందరిపట్ల సమభావం మూలం యిక్కడ
నవభారత నవ్య దివ్య భవితకి అంకురం జరిగేను యిక్కడ
వేన వేల గొంతుకలతో ప్రభాత గీతం ఉషొదయన రాగిణి రాగంలో మారుమ్రోగెను యిక్కడ
మితృలార తరలి రండి యేకం కండి చేయీ చేయీ కలిపి సాగండి
ఈ రాబంధుల కామంధుల దురుము దినం తరిమి తరిమి కొట్టు జనం
కళ్ళు లేని కభోది కూడ యిది చూచి అనందించు వైనం
దూరాన అదిగో నా కన్నులకింపుగ అగుపడుచున్నది కలలో స్వగతంలా వినపడుచున్నది
చూసేకొద్ది మరీ మరీ చూడాలనిపించుచున్నది కడు ముచ్చట గలిపే వైనం కాదా యిది
విసురజ

No comments:

Post a Comment